|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
దేవదాసీ నృత్యాలు

తమ జీవిత సర్వస్వాన్నీ దేవునికే అంకితం చేసి ఆ ఐక్యమునకై తహతహలాడేవారే దేవదాసీలు. స్వామి సన్నిధిలో బలిపీఠంపై నృత్యం చేయడానికి అధికార ముద్రల్ని పొందిన వారే నిజమైన దేవదాసీలు. వీరు ఆంధ్ర దేశంలో నృత్య కళను పోషించి అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వీరు దేవాలయాల నృత్య మండపాలలో, దేవుని సన్నిధానంలో శైవ, వైష్ణవ సంప్రదాయాలను అనుసరించి ఆరాధనా నృత్యాలు, అష్టదిక్పాలికల నృత్యాలు, కేళికా ప్రదర్శనలు, కలాపాలూ మొదలైన నృత్యాలను ప్రదర్శించేవారు. ఈ సంప్రదాయాన్ని నట్టువ మేళ సంప్రదాయం అంటారు. ఈ నట్టువ మేళాల్లో పురుషుల హంగుతో స్త్రీలు మాత్రమే నాట్యం చేస్తారు. కచ్చేరీ నృత్య కళనుంచి ఉద్భవించినవే నట్టువమేళాలు. ఈ నట్టువ మేళాలు అందరికీ పరిచయమైనవే. కచ్చేరీ నృత్యకళ కేవలం రాజాశ్రయమైనది. దేవాలయ నర్తకీమణుల్లో ఒకరిని మించి మరొకరు ఉండేవారు. వీరు నృత్యకళను పట్టుదలగా ఆరాధించేవారు. రాజాస్థానాల్లో మాత్రం అనేకమంది బృంద నాట్యాల్లో పాల్గొనే నాట్యకత్తెలున్నా రాజనర్తకిగా మాత్రం ఒక్కరే ఉండేవారు. రాయల ఆస్థానంలో రంజకం కుప్పాయి, రంగనాథ రాయల ఆస్థానంలో ముద్దు చంద్రరేఖ, ప్రతాపరుద్రుని ఆస్థానంలో మాచల్దేవి, కుమారగిరిరెడ్డి ఆస్థానంలో లకుమా దేవి మొదలైనవారు రాజనర్తకి సంప్రదాయానికి చెందినవారు. ఆనాటి నాట్య శాస్త్రకారులు నృత్తానీ, నృత్యాన్నీ, అబినయాలను మేళవించి ఒక్ నృత్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక్ నృత్య కళగ కచ్చేరీ నృత్య కళను ప్రచారంలోకి తీసుకొచ్చారు. దేవదాసీలు క్షేత్రయ్య పద సాహిత్యానికి నృత్యాభినయాలను రూపకల్పన చేసి ఈ కచ్చేరీ నృత్యకళను ప్రదర్శించేవారు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in