|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పి.టి. ఉష
|
పేరు |
: |
పిలావులక్కండి తెక్కెపరంబిల్ ఉష. |
|
తండ్రి పేరు |
: |
(తెలియదు). |
|
తల్లి పేరు |
: |
(తెలియదు). |
|
పుట్టిన తేది |
: |
27-6-1964. |
|
పుట్టిన ప్రదేశం |
: |
"పయోలీ" అనే గ్రామంలో (కేరళ) లో జన్మించింది. |
|
గొప్పదనం |
: |
ఐదు స్వర్ణ పతకాలు గెలిచి రికార్డు సృష్టించింది. |
పి.టి. ఉష - 'పయోలీ ఎక్స్‌ప్రెస్' అని అందరూ పిలుచుకునే పిలావులక్కండి తెక్కెపరంబిల్ ఉష భారత స్ప్రింట్ రంగాన్ని తన అసాధారణ ప్రతిభాసామర్థ్యాలతో అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. 1964వ సంవత్సరం జూన్27వ తేదిన కేరళ రాష్ట్రంలోని పయోలీ గ్రామంలో పి.టి.ఉష జన్మించారు. చిన్ననాటినుంచి ఉషకు 'పరుగు' అంటే చాలా యిష్టం. సాయంకాలం బీచ్‌లో చాలాసేపు, అలసిపోయే వరకు ప్రతిరోజూ పరుగెత్తేది. కానీ, ఏనాడూ 'పరుగు'ను తన కెరీర్‌గా మలుచుకోవాలనుకోలేదు. మలుచుకుంటాననుకోలేదు.
పి.టి. ఉషకు తన 13 సంవత్సరాల వయసులో, 1977వ సంవత్సరంలో కన్ననోర్‌లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ' స్పోర్ట్స్ కోచ్ (క్రీడా శిక్షకుడు)' ఒ.పి. నంబియార్ ఉషలోని అసాధారణ ప్రతిభను 1982వ సంవత్సరంలో ఢిల్లీలో నిర్వహించబడిన "ఏషియన్ గేమ్స్‌లో రెండు రజత పతకాలు సాధించడం" ద్వారా ఉష వెలుగులోకి వచ్చారు.
1984వ సంవత్సరంలో లాస్ఏంజెల్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో ఫైనల్స్ స్థాయికి చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించినప్పటికీ, సెకనులో వందోవంతు సమయం తేడాతో పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయారు. ఆ ఒలింపిక్స్ నాలుగవ స్థానంతో తృప్తి పడవలసివచ్చినా 55.42 సెకన్లతో ఆసియన్ రికార్డు సృష్టించారు. తరువాత 1985వ సంవత్సరంలో ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన "ఏషియన్ ట్రాక్ అండ్ పీల్డ్ ఛాంపియన్ షిప్" పోటీల్లో 100 మీ., 200 మీ., 400మీ హీర్డిల్స్, 2*400 రిలే పోటీల్లో స్వర్ణపతకాలు సాధించడంతో పి.టి. ఉష పేరు మారు మ్రోగిపోయింది. ఆ పోటీల్లో ఐదు స్వర్ణ పతకాలు గెలిచి రికార్డు సృష్టించడంతో పి.టి. ఉషను "భారతదేశానికి బంగారు బాలిక" గా అందరూ ప్రశంసించారు.
తరువాత 1986వ సంవత్సరంలో సియోల్‌లో జరిగిన పదవ ఏషియన్ క్రీడల్లో కూడా అదే ఊపును కొనసాగించి నాలుగు స్వర్ణాలు, ఒక రజిత పతకం సాధించారు. 1989వ సంవత్సరంలో జరిగిన ' ఏషియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ 'లో ఉత్తమ అధ్లెట్ గా భారతీయ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారు పి.టి.ఉష. 1991వ సంవత్సరంలో వివాహానంతరం మూడు సంవత్సరాలు క్రీడలకు దూరమైనప్పటికీ, భర్త ప్రోత్సాహంతో 1994వ సంవత్సరంలో జరిగిన "ఏషియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్" ఈవెంట్‌లో పాల్గొన్నారు. 1998వ సంవత్సరంలో జపాన్‌లో జరిగిన క్రీడల్లో రెండు కాంస్య పతకాలు సాధించారు. పి.టి. ఉష ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అర్జున అవార్డు, పద్మశ్రీ బిరుదులను (1984వ సంవత్సరం) ప్రధానం చేసింది.
భారతీయ మహిళా క్రీడాకారిణులకు ఆదర్శంగా నిలిచిన పి.టి.ఉష ప్రస్తుతం క్రీడారంగానికి దూరంగా వున్నారు.
మూలం: భారతీయం, ఆదెళ్ళ శివకుమార్, ఓం పబ్లికేషన్స్.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in