www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

గోపాలక్రిష్ణ గోఖలే

పేరు

:

గోపాలక్రిష్ణ గోఖలే.

తండ్రి పేరు

:

(తెలియదు).

తల్లి పేరు 

:    (తెలియదు).

పుట్టిన తేది

:

9-5-1886.

పుట్టిన ప్రదేశం

:

"రత్నగిరి" జిల్లాలోని (మహారాష్ట్ర) కోట్లుక్‌ లో జన్మించాడు.

చదివిన ప్రదేశం

:

ఇంగ్లాండ్‌.

చదువు

:    భారతీయ అర్ధశాస్త్రాన్ని అభ్యసించారు.

గొప్పదనం

:

గోఖలేగారిని తమ రాజకీయ 'గురువు' గా పేర్కొన్నారు.

స్వర్గస్తుడైన తేది

:     1915.

"భారతదేశానికి లభించిన వజ్రం, మహారాష్ట్ర ఆణిముత్యం గోఖలే" అన్న బాలగంగాధర తిలక్ మాటలు అక్షర సత్యాలు. స్వాతంత్ర్యసమరయోధునిగా, నాయకునిగా, ఆర్ధికవేత్తగా పలువురిని ప్రభావితం చేశారు గోఖలే. అంతటి ఉన్నత వ్యక్తిత్వం కలవారు కనుకనే మహాత్మాగాంధీ వంటివారు గోఖలేగారిని తమ రాజకీయ 'గురువు' గా పేర్కొన్నారు.

రత్నగిరి జిల్లాలోని (మాహారాష్ట్ర) కోట్లుక్‌లో 9 మే 1886 వ సం||న గోఖలేగారు ఒక సాంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఇంగ్లండ్ వెళ్ళి ICS (Indian Civil Services) చేయాలన్న సోదరుని మాటను కాదని జస్టిస్ రణడే శిష్యరికంలో భారతీయ అర్ధశాస్త్రాన్ని అభ్యసించారు గోపాలకృష్ణ గోఖలే. 1900 వ సం||లో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన గోఖలేజీకి అక్కడ ఫిరోజ్‌షా మెహతా సహచర్యం లభించింది. 1902 వ సం||లో వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడైన గోఖలే భారత ఆర్ధిక వ్యవస్ధ అస్తవ్యస్తతపై ఉపన్యసించిన తీరు పలువురిని ఆకట్టుకోవడమే కాక, ఆయనలోని ఆర్ధికవేత్తను పరిచయం చేసింది. 1905 వ సం||లో బెనారస్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన గోఖలేనాటి ప్రసంగం నేటికీ అత్యుత్తమ ప్రసంగాలలో ఒకటిగా కీర్తించబడుతోంది.

విదేశాలలో వున్న భారతీయ హక్కుల సాధన పట్ల గోఖలేగారు శ్రద్ధ చూపేవారు. అటువంటి సమయంలో గోఖలేకి దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల పరిరక్షణకోసం ఉద్యమించిన గాంధీ పరిచయం అయ్యారు. వారి ఉద్యమానికి ఆయన పరిపూర్ణ మద్దతునిచ్చారు. తరువాత వారిద్దరి పరిచయం నిలబడి, గురుశిష్యుల బంధం కావడం జరిగింది.

భారత స్వాతంత్రోద్యమంలో కీలక పాత్రపోషించిన గోపాలకృష్ణ గోఖలేగారు 1915వ సంవత్సరంలో పరమపదించారు. బ్రిటిష్, భారత (ఆంగ్లేయ) ప్రభుత్వాలు గోపాలకృష్ణ గోఖలేని భారతదేశ తరపు ప్రతినిధిగా భావించాయి. భారతీయ, పాశ్చాత్య సంస్కృతుల మధ్య సమన్వయకర్తగా నిలిచిన గోపాలకృష్ణ గోఖలే తన తరంలోని యితర నాయకులకంటే భిన్నంగా వుండేవారు. ఆ విభిన్నా వ్యక్తిత్వమే గాంధీలాంటి వారిని ఆకట్టుకొని, వారిని 'తమ గురువు' గా భావించేలా చేసింది.

మూలం: భారతీయం, ఆదెళ్ళ శివకుమార్, ఓం పబ్లికేషన్స్.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in