|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
సందర్భం: తెలుగుదనం.కో.ఇన్ వెబ్ సైట్ ప్రధమ వార్షికోత్సవము మరియు ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవమును పురస్కరించుకుని నిర్వహించిన సత్సంగము.
విషయము: తెలుగు భాషాభివృధ్ధికి చేయదగిన కృషి
వేదిక: గీతా కార్యాలయము, చీరాల
తేదీ: గురువారం, 1 నవంబరు 2007, ఉ. 10:00 గం. నుండి 12:00 గం.ల వరకు
పాల్గొనినవారు:
1. శ్రీ పరవస్తు వెంకయ్య సూరి గారు, తెలుగు పండితులు, పరవస్తు చిన్నయసూరి గారి వంశీయులు
2. "సేవాభారతి" శ్రీ కాకరపర్తి వేంకటేశ్వర్లు గారు, చీరాల సాహితీ స్రవంతి వ్యవస్తాపకులు
3. శ్రీ జె. గంగాధర రావు గారు, తెలుగు భాషోద్యమ చీరాల శాఖ వ్యవస్థాపకులు
4. శ్రీ వడలి రాధాకృష్ణ గారు, సహజ సాహితి వ్యవస్థాపకులు
5. శ్రీ వేములపాటి దాశరధి గారు, తెలుగు భాషాభిమాని
6. శ్రీ వలివేటి మురళీ కృష్ణ గారు, తెలుగుదనం.కో.ఇన్ వెబ్ సైట్ వ్యవస్థాపకులు
మరియు తెలుగుదనం బృందం, తెలుగు భాషాభిమానులు, పాత్రికేయులు
ముఖ్య విషయములు:
1. మురళీ కృష్ణ గారు తెలుగుదనం వెబ్ సైట్ గురించి విశదీకరించారు. ఇంటర్నెట్లో చూపించారు. ప్రధానమైన అంశాలు ఇవీ...
8 ప్రధాన విభాగాలు - తెలుగు పాఠాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, సాహిత్యం, పిల్లల కోసం, వనితల కోసం, అందరి కోసం, విజ్ఞానం
961 పేజీలు, 2477 ఫైల్లు- 42 తెలుగు పాఠాలు
33 పండుగలు, 35 పుణ్యక్షేత్రములు, 30 వ్రతములు, 360 దేవుళ్ళ చిత్ర పటములు
24 దేశభక్తి గేయాలు, వందలకొద్దీ పాటలు, పల్లవులు, సామెతలు, సూక్తులు, పొడుపుకధలు
112 నీతి కధలు, 72 పిల్లల ఆటలు, 90 పిల్లల గేయాలు, 38 మంది భరతమాత ముద్దు బిడ్డలు
453 వంటలు, డజన్ల కొద్దీ ముగ్గులు, వందల కొద్దీ చిట్కాలు
ఇంకా, జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు, ఆహార పోషణ, హాస్య సంపద, తెలుగు పత్రికలు, ప్రవాసాంధ్రులు, మొదలగు విషయాలెన్నో వున్నాయి.
ఈ మొదటి సంవత్సరంలో దాదాపు అయిదు మంది సంవత్సర కాలం చేసినంత కృషి జరిగింది.
11 వేల మంది పైచిలుకు తెలుగు వాళ్ళు 65 దేశాల నుండి తెలుగుదనం వెబ్ సైట్ను సందర్శించారు.
అంతా చీరాలలోనే తయారుచేశారు, ప్రతివారం క్రొత్త విషయాలను జతచేస్తున్నారు.
2. పెద్దలు అందించిన సూచనలు, సలహాలు:
కార్పొరేట్ విద్యాసంస్థలలో తెలుగు భాషపై ఆసక్తిని పెంచే కృషి చేయడం. వారు తెలుగును పిల్లలకు దూరం చేయకుండా కలిసి కృషి చేయడం
చీరాల స్థాయిలో ప్రభుత్వ వుత్తర్వులు తెలుగులోనే ప్రచురించేటట్లు చూడటం
సాటి తెలుగువారితో మాట్లాడేటప్పుడు అవతలివారు ఇంగ్లిష్లో మాట్లాడుతూ వున్నా మనం చిన్నతనం అనుకోకుండా తెలుగులోనే మాట్లాడుతూ మెల్లగా వారుకూడా తెలుగులో సంభాషించేటట్లు చేయడం
తెలుగుభాషలో చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో కొంత శాతం కేటాయించడం, ఇంకా సముచితమైతే ఎన్నుకునే సమయంలో రాయితీలివ్వడం
తెలుగు వ్యాకరణం ప్రాచుర్యం పొందేటట్లు చూడటం
తెలుగుదనం.కో.ఇన్ వెబ్ సైట్లో సుమతీ, వేమన, దాశరధీ శతకాల మీద దృష్టి పెట్టి రోజుకి ఒక పద్యం అందరూ నేర్చుకునేటట్లు ప్రోత్సహించడం
తెలుగు కవుల, రచయితల వివరములను, హైదరాబాదు ట్యాంకుబండు మీద వున్న విగ్రహాల చిత్ర పటములు, అలానే, కృష్ణా జిల్లా రచయితల సంఘం నుండి వివరములను సేకరించి తెలుగుదనం వెబ్ సైట్లొ ప్రచురించడం
ధన్యవాదములు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in